![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -41లో.. మాణిక్యం ఇంటికి సీతాకాంత్ తన తల్లి శ్రీలత, మరదలు శ్రీవల్లిని తీసుకొని వస్తాడు. వాళ్ళు రావడం చూసిన రామలక్ష్మి, సుజాత, ధన ముగ్గురు వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. అప్పుడే మాణిక్యం వచ్చి సుజాతపై అరుస్తుంటే.. అందరు షాక్ అవుతారు. వాళ్ళు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళని ఫ్యామిలీతో రిసీవ్ చేసుకోవాలి కదా అని మాణిక్యం అంటాడు.
ఆ తర్వాత మాణిక్యం వాళ్ళని పలకరిస్తుంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. అందరు ఇంట్లోకి వస్తారు. కూర్చోండి అంటూ వాళ్ళకి ఒక బెంచ్ వేసి మాణిక్యం మాత్రం ఒక పెద్ద కుర్చీ వేసుకుంటాడు. అదంతా చూస్తుంటే రామలక్ష్మికి కోపం వస్తుంది. అలా మాణిక్యం చేసిన సరే సీతకాంత్ ఓపికగా ఉంటాడు. మాణిక్యం వాళ్ళ ముందే కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని ఉంటాడు. శ్రీలతకి పట్టరాని కోపం వస్తుంది. మాణిక్యం వాళ్లకి కోపం వచ్చేలా మాట్లాడుతుంటాడు. నాన్న మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు.. వాళ్ళ స్థాయి మర్చిపోయి మన ఇంటికి వస్తే ఇలాగేనా అవమానించేదని రామలక్ష్మి అంటుంది. కాసేపటికి మీ అబ్బాయి ధనని నా చెల్లి సిరికి ఇచ్చి పెళ్లి చెయ్యండి అని సీతాకాంత్ అడుగుతాడు. ఇక మీరు వెళ్లొచ్చని మాణిక్యం అనగానే.. అందరు షాక్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నావేంటని సీతాకాంత్ కోప్పడతాడు. మీరు అడుగుతున్నారు కానీ మీ అమ్మ గారు అడగడం లేదని మాణిక్యం అంటాడు.
ఆ తర్వాత శ్రీలత కూడా.. మా కూతురిని మీ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని అడుగుతుంది.. సరే ఒప్పుకుంటున్నానని మాణిక్యం అంటాడు. మీ కొడుకు ఇల్లరికం వచ్చే విషయం ఆల్రెడీ మీ అమ్మాయి చెప్పిందని అనగానే.. నా కొడుకుని తీసుకొని వెళ్లి కుక్కపిల్లలాగా కట్టేసుకుంటారా.. నా కొడుకు ఎక్కడ ఉన్నా నా కొడుకే దీనికి ఒప్పుకుంటున్నా కానీ ఒక్క కండిషన్ అని మాణిక్యం అంటాడు. ఏంటని సీతాకాంత్ అడుగుతాడు. చావు భయం ఎలా ఉంటుందో నాకు ఇరవై నాలుగు గంటల టైమ్ ఇచ్చావ్ కదా.. ఇప్పుడు నీకు భయం తెలియాలి కదా.. అందుకే నేను కూడా రేపు చెప్తానని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |